Fort Mutyamrayudu

ముత్యంరాయుడు కోట

ముత్యంరాయుడు కోట

పేరు

ముత్యంరాయుడు కోట

ప్రాంతం

నారాయణరావుపేట, సిద్దిపేట జిల్లా, తెలంగాణ, భారత్

వనదుర్గం

నిర్మాణ కాలం

18వ శతాబ్దం (అంచనా)

పరిస్థితి

శిథిలాలు |+ చారిత్రక సమాచారం

నిర్మించినవారు

ముత్యంరాయుడు (స్థానిక జానపద కథనం ప్రకారం)

పాలించినవారు

ముత్యంరాయుడు

నియంత్రణ

తెలంగాణ రాష్ట్రం

ఉపయోగం

స్థానిక రక్షణ, పరిపాలన

పరిచయం

ముత్యంరాయుడు కోట తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా పరిధిలోని నారాయణరావుపేట గ్రామానికి ఉత్తరంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక కోట శిథిలం. స్థానిక జానపద కథనాల ప్రకారం, ప్రజావీరుడు ముత్యంరాయుడు ఈ కోటను నిర్మించాడని చెబుతారు.

స్థానం

నారాయణరావుపేటకు ఉత్తర దిశలో ఉన్న ఎత్తైన ప్రదేశంలో, ఒకప్పుడు దట్టమైన అడవులతో కప్పబడిన ప్రాంతంలో కోట నిర్మించబడింది. భౌగోళికంగా ఇది రక్షణకు అనుకూలమైన ప్రాంతంగా ఉంది.

చరిత్ర

రాజ్యాధికారులు పన్నులు పెంచుతూ, ప్రజల కష్టాలను పెంచిన కాలంలో, ముత్యంరాయుడు ప్రజల రక్షకుడిగా వెలిగాడు. ధనవంతులు, భూస్వాముల నుండి సంపదను దోచి, పేద ప్రజలకు పంచేవాడిగా స్థానిక జానపద కథనాలు చెబుతున్నాయి. ఈ కోటను ప్రజల రక్షణ కోసం నిర్మించాడని ప్రజలు విశ్వసిస్తున్నారు.

జానపద గీతలు

ముత్యంరాయుడు గురించి అనేక గ్రామీణ జానపద గీతాలు ఉన్నాయి. ప్రజల రక్షకుడిగా, శత్రువులకు అందని వీరుడిగా ఆయనను వర్ణిస్తూ పాడేవారు.

"ఓ ముత్యంపురాయా... ఆగండ్ల ముల్లెలన్ని యెల్లావుల బండ్లయేశి పన్నెండు గండ్లు దాటినవ ఓ ముత్యంపురాయా... శత్రూవు నిను కొట్టలేడూ క్రూరామృగములు పట్టలేవు నింగినేలా ముట్టుకోవూ గాలిలొ నువు తేలివస్తావా ఓ ముత్యంపురాయా..."

కోట నిర్మాణం

ముత్యంరాయుడు కోటను వనదుర్గంగా నిర్మించారు. మూడు అంచెల రక్షణ వ్యవస్థ ఉంది:

• మూడువైపులా ఎత్తైన రాతిగోడలు • కోట అంతర్భాగంలో బలమైన కోటగోడ • నాలుగు దిక్కుల రక్షణకు ఆరు బురుజులు • కోట చుట్టూ నీటికందకాలు • గోడలు సుమారు 20 అడుగుల వెడల్పుతో నిర్మించబడ్డాయి.గోడలపై గుర్రాలతో పహారా నిర్వహించేందుకు వీలుగా ఈ వెడల్పు ఉంచబడినట్లు చెబుతారు.

ప్రధాన ద్వారం

ప్రధాన ద్వారం 'ఏనుగుదర్వాజ' అని పిలుస్తారు. పై భాగంలో బంగ్లా బురుజు ఉంది.

మైసమ్మ బురుజు

దక్షిణ బురుజు 'మైసమ్మ బురుజు'. ప్రతి కోటలో కోటమైసమ్మను ప్రతిష్టించడం సంప్రదాయం. చెక్కతో చెక్కిన దారుశిల్పం దేవతకు పూజలు ఇంకా జరుగుతున్నాయి.

పిల్లిద్వారం

మైసమ్మ బురుజుకు సమీపంలో చిన్న ద్వారం 'పిల్లిద్వారం' అని పిలుస్తారు. శత్రువుల దాడి సమయంలో రహస్యంగా బయటకు వెళ్లే సొరంగాలకు దారి తీసేది.

ప్రసిద్ధ బావి

కోటలో పడమటి బావి ఉంది. స్థానిక కథనం ప్రకారం, ముత్యంరాయుడు తన దాచిన సంపదను గొలుసులతో కట్టి ఇక్కడ దాచేవాడని చెబుతారు.

చెరువు

ముత్యంరాయుడు నిర్మించిన చెరువు "ముత్యం చెరువు" అని ప్రజలు పిలుస్తారు. ఇప్పటికీ మత్తడిపోచమ్మ దేవతకు పూజలు జరుగుతున్నాయి.

https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F%E0%B1%8D